☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. ప్ర‌తిప‌క్షాల డిమాండ్

Gyanesh Kumar : కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌ని కేంద్రంలోని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేర‌కు కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ స‌హా అనేక పార్టీలు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నాయి.
Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. ప్ర‌తిప‌క్షాల డిమాండ్

Gyanesh Kumar : కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌ని కేంద్రంలోని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేర‌కు కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ స‌హా అనేక పార్టీలు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నాయి. స‌ర్ ప్ర‌క్రియ కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌భ్యుల మ‌ధ్యే విబేధాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా స‌ర్ ప్ర‌క్రియ విష‌యంలో ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు 14సార్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు వెల్ల‌డైంది.

త‌మ‌కు తెలియ‌కుండానే జ్ఞానేష్ కుమార్ కొన్ని నిర్ణ‌యాల‌ను అమ‌లు చేసిన‌ట్లు మిగ‌తా ఇద్ద‌రు స‌భ్యులు వ్య‌తిరేకించారు. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరుపై, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి. జ్ఞానేష్ కుమార్ మ‌ద్ద‌తుతో కేంద్ర ప్ర‌భుత్వం ఓట్ చోరీకి పాల్ప‌డింద‌ని విమ‌ర్శిస్తున్నాయి. లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్, టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ త‌దిత‌ర నేత‌లు కేంద్రంపై మండిప‌డుతున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప‌ద‌విలోంచి తొల‌గించాల‌ని, బీజేపీకి ఎన్నిక‌ల్లో అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి దేశ ద్రోహానికి పాల్ప‌డ్డ ఆయ‌న‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అవ‌స‌ర‌మైతే ఆయ‌న‌పై పార్ల‌మెంట్‌లో అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. అయితే, ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల్ని బీజేపీ ఖండిస్తోంది. వోట్ చోరీ జ‌రిగితే.. అనేక చోట్ల ప్ర‌తిప‌క్షాలు ఎలా గెలుస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఇందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌ల్ని వివ‌రిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు చేత‌నైతే సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై పార్ల‌మెంట్‌లో అభిసంశ‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని బీజేపీ స‌వాల్ చేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జీవాల పెంపకం, వ్యాధులు, నివారణపై శిక్షణదోమలపల్లిలో పోషణ మాసం కార్యక్రమం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com