☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఓ ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. త్వరలోనే 2000 రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. మీ ఈ-కేవైసీ (eKYC) గనక పూర్తవ్వకపోతే మాత్రం ఈసారి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పడవు. గతంలో వచ్చిన 23వ విడత సమయంలో కూడా ఈ-కేవైసీ పూర్తికాని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ (pmkisan.gov.in)లో సాధారణ రైతులకు డైరెక్ట్‌గా ఈ-కేవైసీ చేసుకునే ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో చాలామంది రైతులు ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలా అని కంగారు పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు, దీనికి మూడు సులువైన మార్గాలు ఉన్నాయి. అలాగే ఊర్లోకి వచ్చి ఈ-కేవైసీ చేస్తామని డబ్బులు వసూల
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఓ ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. త్వరలోనే 2000 రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. మీ ఈ-కేవైసీ (eKYC) గనక పూర్తవ్వకపోతే మాత్రం ఈసారి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పడవు. గతంలో వచ్చిన 23వ విడత సమయంలో కూడా ఈ-కేవైసీ పూర్తికాని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ (pmkisan.gov.in)లో సాధారణ రైతులకు డైరెక్ట్‌గా ఈ-కేవైసీ చేసుకునే ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో చాలామంది రైతులు ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలా అని కంగారు పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు, దీనికి మూడు సులువైన మార్గాలు ఉన్నాయి. అలాగే ఊర్లోకి వచ్చి ఈ-కేవైసీ చేస్తామని డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మొదటి మార్గం ఏంటంటే..?

మీ ఊరిలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రానికి వెళ్లండి. పీఎం కిసాన్ పోర్టల్‌లో సాధారణ రైతులకు ఈ-కేవైసీ ఆప్షన్ లేకపోయినా, సిఎస్సి కేంద్రాల విఎల్ఈ (VLE) లాగిన్‌లో ఆ సదుపాయం ఉంటుంది. మీరు మీ ఆధార్ కార్డు, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తీసుకుని సిఎస్సి కేంద్రానికి వెళ్తే, అక్కడ బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేస్తారు. అయితే దీనికి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము మాత్రమే ఇవ్వండి, అంతకుమించి ఎక్కువ డబ్బులు ఇవ్వకండి.

మొబైల్ ద్వారానే ఈ కేవైసీ..

మొబైల్‌లో ముందుగా ప్లే స్టోర్ నుంచి ‘PM Kisan’ యాప్, ‘Aadhaar Face RD’ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. పీఎం కిసాన్ యాప్‌ను ఓపెన్ చేసి, భాషను ఎంచుకుని లాగిన్ రకంలో ‘Beneficiary’ అని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ ఇవ్వగానే ఫేషియల్ ఈ-కేవైసీ (Facial eKYC) ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నిబంధనలకు అంగీకరిస్తూ ఫేస్ స్కాన్ సెలెక్ట్ చేసి, మీ ముఖాన్ని మొబైల్ కెమెరాలోని సర్కిల్ లోపల స్పష్టంగా ఉంచాలి. ఆ లైన్లు గ్రీన్ కలర్‌లోకి మారగానే స్కాన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఒక mPIN క్రియేట్ చేసుకుని పీఎం కిసాన్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి ‘eKYC Status’ చెక్ చేసుకుంటే, అక్కడ ‘Yes’ అని వస్తే మీ ఈ-కేవైసీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయినట్లే.

ఇక మూడో మార్గం..?

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాగిన్ల ద్వారా పూర్తి ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు. మీ ప్రాంతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అధికారులు లేదా సిబ్బంది వద్ద ఉండే స్పెషల్ లాగిన్ ఐడీల ద్వారా కూడా మీ ఈ-కేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. చివరగా ఒక ముఖ్యమైన హెచ్చరిక.. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేస్తామంటూ వచ్చి అమాయక రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి నకిలీ వ్యక్తులను అస్సలు నమ్మకండి, వారికి డబ్బులు ఇవ్వకండి. అసలు మీకు ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదో ముందుగా మీ మొబైల్‌లో లేదా సిఎస్సి కేంద్రంలో సరిచూసుకుని, కేవలం పైన పేర్కొన్న అధికారిక మార్గాల్లో మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com