☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వ్యవసాయానికి కోతలు లేని కరెంటు అందించాలని నిరసన

రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు కోతలు లేని నాణ్యమైన కరెంటును అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తుంగ‌తుర్తి శ్రేణులు బుధవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మ‌ర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గొట్టిపర్తి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు...
వ్యవసాయానికి కోతలు లేని కరెంటు అందించాలని నిరసన

తుంగ‌తుర్తి, సెప్టెంబ‌ర్ 23 : రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు కోతలు లేని నాణ్యమైన కరెంటును అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తుంగ‌తుర్తి శ్రేణులు బుధవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మ‌ర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గొట్టిపర్తి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బర్ల సోమన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా, కరెంటు, కాల్వ‌ల ద్వారా సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులు పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేష్, తాళ్లపల్లి యాకయ్య, చింతకుంట్ల సురేష్, శ్రీనివాస్, ఏకయ్య, కృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Mysaa Teaser | అదరగొట్టేసిన రష్మిక మందన్నా.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మైసా టీజర్‌ వ్యూస్‌వెంకన్న మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సంతాపం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com