☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

SA vs AUS | రెన్‌షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!

SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా (Australia) గొప్పగా పుంజుకుంది. తొలిరోజు 84 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మ్యాట్ రెన్‌షా(102 నాటౌట్) పోరాటంతో గట్టెక్కింది.
SA vs AUS | రెన్‌షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!

SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా (Australia) గొప్పగా పుంజుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి తొలిరోజు 84 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మ్యాట్ రెన్‌షా(102 నాటౌట్) పోరాటంతో గట్టెక్కింది. సఫారీ పేస్‌ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న రెన్‌షా సూపర్ శతకంతో చెలరేగాడు. అతడికి కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌(43) నుంచి చక్కని సహకారం లభించడంతో లంచ్ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

శాండ్‌పేపర్ గేట్ వివాదం తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా గాడీలో పడింది. తొలిరోజు డర్బన్‌లో సఫారీ పేస్ త్రయం ధాటికి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను మ్యాట్ రెన్‌షా(102 నాటౌట్), సారథి ప్యాట్ కమిన్స్‌(43)లు ఆదుకున్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 187/6తో రెండో రోజు ఆట మొదలెట్టిన కంగారూ జట్టును రెన్‌షా ఒడ్డున పడేశాడు.

అనుభవజ్ఞులైన ట్రావిస్ హెడ్‌(9), లబూషేన్‌(37), స్టీవెన్ స్మిత్(25), అలెక్స్ క్యారీ(14)లు విఫలమైన చోట క్రీజులో పాతుకుపోయి సఫారీలను తిప్పలు పెట్టిన అతడు.. ఈ ఫార్మాట్‌లో రెండోసారి మూడంకెల స్కోరందుకున్నాడు. రెన్‌షా అసమాన పోరాటం ఫలితంగా భోజన విరామం సమయానికి పర్యాటక జట్టు 8 వికెట్ల నష్టానికి 277 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శతక వీరుడికి జతగా సీనియర్ ఆటగాడు నాథన్ లియన్(8 నాటౌట్) ఉన్నాడు. ప్రొటిస్ బౌలర్లలో వియాన్ మల్డర్(4-51) నాలుగు వికెట్లు తీశాడు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డిNetflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com