☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Renu Desai | డీజే సౌండ్స్‌పై కామెంట్స్ చేసినందుకు ట్రోలింగ్.. నా పాయింట్ అర్థం చేసుకోండంటూ రేణూ కామెంట్

Renu Desai | వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల్లో రాత్రివేళ డీజే సౌండ్స్‌పై చేసిన వ్యాఖ్యలతో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో.. తాజాగా రేణు దేశాయ్ మరోసారి స్పందించారు.
Renu Desai | డీజే సౌండ్స్‌పై కామెంట్స్ చేసినందుకు ట్రోలింగ్.. నా పాయింట్ అర్థం చేసుకోండంటూ రేణూ కామెంట్

Renu Desai | వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల్లో రాత్రివేళ డీజే సౌండ్స్‌పై చేసిన వ్యాఖ్యలతో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో.. తాజాగా రేణు దేశాయ్ మరోసారి స్పందించారు. తన ఉద్దేశం మతాన్ని లేదా ధర్మాన్ని విమర్శించడం కాదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. తాను సనాతన ధర్మానికి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడనని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. గణపతి బప్పాపై తనకు ఎంతో భక్తి ఉందని చెబుతూ.. తాను చెప్పిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే స్పందించాలని నెటిజన్లను కోరారు.

పండగల సమయంలో భక్తి పేరుతో రాత్రివేళ అధిక శబ్దంతో డీజేలు పెట్టడం, మద్యం సేవించి అసభ్యకరంగా డ్యాన్స్ చేయడం వంటి విషయాలపైనే తాను మాట్లాడానని ఆమె వివరించారు. ఇవి మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భక్తికి, విచ్చలవిడితనానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సూచించారు. వినాయక చవితి, నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని రేణు దేశాయ్ కోరారు. డప్పులు, సంప్రదాయ వాయిద్యాలతో ఉత్సవాలు నిర్వహించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే భారీ శబ్దాలతో కూడిన డీజేలను అర్థరాత్రి వరకు కొనసాగించడమే తనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు.

ముఖ్యంగా రాత్రివేళ పెద్ద శబ్దాల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఉత్సవాల్లో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండగలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో దూషించడంపై కూడా రేణు దేశాయ్ స్పందించారు. తనను తిట్టే ముందు ఒక్కసారి తాను చెప్పిన విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలని కోరారు. తన మాటల్లోని ఉద్దేశాన్ని, నిజాయితీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. గతంలో కూడా పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలపై రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. వినాయక విగ్రహాల విషయంలో పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించాలని కూడా ఆమె పలుమార్లు అవగాహన కల్పించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kaaka | చిరు లీక్స్.. ‘కాకా’ మూవీ నుంచి మెగాస్టార్ క్రేజీ అప్‌డేట్!Weekend OTT Movies | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలివే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com