☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సీజనల్ వ్యాధుల పట్ల చ‌ర్య‌లు చేపట్టాలని వినతి

తుంగతుర్తి ప్రాంతంలోని పలు గ్రామాల్లో చిరు జల్లులు కురవడంతో ప్రజలు విష జ్వరాలు, సీజనల్ వ్యాదుల భారిన పడుకున్నారని బీఆర్ఎస్ మండ‌లాధ్య‌క్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ముంద‌స్తు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా కోరుతూ బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి...
సీజనల్ వ్యాధుల పట్ల చ‌ర్య‌లు చేపట్టాలని వినతి

తుంగతుర్తి, సెప్టెంబ‌ర్ 23 : తుంగతుర్తి ప్రాంతంలోని పలు గ్రామాల్లో చిరు జల్లులు కురవడంతో ప్రజలు విష జ్వరాలు, సీజనల్ వ్యాదుల భారిన పడుకున్నారని బీఆర్ఎస్ మండ‌లాధ్య‌క్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ముంద‌స్తు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా కోరుతూ బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్ప‌త్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజును క‌లిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీజన్ వ్యాధుల పట్ల వైద్య అధికారులు తగిన చర్యలు చేపట్టాలని, పేద ప్రజలకు సకలంలో నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. అనంతరం వంద పడకల ఆస్ప‌త్రి భవన నిర్మాణ పనులను వారు పరిశీలించారు.

తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని సంకల్పంతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హాయాంలోనే వంద పడకల ఆస్ప‌త్రి నిర్మాణం ప్రారంభ‌మైంద‌ని, స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అధికారులతో రివ్యూ చేసి సకాలంలో ఆస్ప‌త్రి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు గోపగాని రమేష్, గోపాగాని వెంకన్న, బొంకూరి మల్లేష్, ఉప్పుల నాగామల్లు, గుడిపాటి వీరయ్య, గడ్డం సోమేశ్, మల్లెపాక ముత్తయ్య, బొజ్జ సాయికిరణ్, పాలడుగు జలంధర్, మల్లెపాక యాదగిరి, కొల్లూరి మహేందర్, లాకావత్ సోమన్న, దారవాత హేమ్లా నాయక్ పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దోమలపల్లిలో పోషణ మాసం కార్యక్రమంMysaa Teaser | అదరగొట్టేసిన రష్మిక మందన్నా.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మైసా టీజర్‌ వ్యూస్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com