☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయాలి... లేదంటే జంతర్ మంతర్ 2.0 ఉద్యమం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్దీప్కే

48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయాలి... లేదంటే జంతర్ మంతర్ 2.0 ఉద్యమం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్దీప్కే
48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయాలి... లేదంటే జంతర్ మంతర్ 2.0 ఉద్యమం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్దీప్కే
48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయాలి... లేదంటే జంతర్ మంతర్ 2.0 ఉద్యమం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్దీప్కే
  • దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కాలి

న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. ఆయన 48 గంటల్లోగా పదవి నుంచి తప్పుకోకపోతే ఢిల్లీలో ‘జంతర్ మంతర్ 2.0’ ఉద్యమంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. 'ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో' పేరుతో సీజేపీ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి ఏకంగా 13 కోట్లకు పైగా పేర్లను తొలగించడమే లక్ష్యంగా ఈ ఆందోళనలు ఉంటాయని స్పష్టం చేసింది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కో-–కన్వీనర్ సౌరవ్ దాస్, ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా భ్రష్టుపట్టిందని, ప్రజల ఓటు హక్కును దెబ్బతీస్తున్నారని వారు మండిపడ్డారు.

సీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. ‘‘ఎస్ఐఆర్ సమయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, మునుపటి ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలి. సంబంధిత దస్త్రాలను సుప్రీంకోర్టుకు లేదా న్యాయపరమైన కమిటీకి అప్పగించాలి.

సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియలో సమూల సంస్కరణలు తేవాలి”అని పేర్కొంది. మహారాష్ట్రలో 2 కోట్లు, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 కోట్లు, కర్ణాటకలో కోటి, తెలంగాణలో 73 లక్షల చొప్పున కోట్లాది ఓట్లు తొలగించబడ్డాయని సీజేపీ ఆరోపించింది.

అమిత్ షా ఆదేశించినట్టే చేస్తున్నారు..

జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టాక బీజేపీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగిందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఆయన పనిచేస్తున్నారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. 'జెన్-జీ' యువత తమకు మద్దతు ఇవ్వడం లేదన్న భయంతోనే అధికార పార్టీ యువ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోందని ఆరోపించారు.

బీజేపీ, ఈసీ కలిసి ఎస్ఐఆర్ ను రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యువత, సివిల్ సొసైటీ, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి పోరాడాలని పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← కాగజ్ నగర్: ఆఫీసర్లకు సమావేశానికి వచ్చే సమయం లేదా? : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్నీట్ పీజీ ఫలితాలు విడుదల →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com