నగోయా: ఏషియన్ పారా గేమ్స్(Asian Para Games)లో భారత్ విజృంభిస్తోంది. మెన్స్ షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్‌లో ఇండియా పోడియం స్వీప్ చేసింది. ఆ ఈవెంట్‌కు చెందిన మూడు మెడల్స్ ఇండియన్ అథ్లెట్లకే దక్కాయి. మెన్స్ షాట్‌ఫుట్‌లో సచిన్ ఖిలారి, మొహమ్మద్ యాసిర్, పర్వీన్ .. వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. పారాలింపిక్ మెడలిస్ట్ సచిన్.. ఏషియన్ గేమ్స్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేశారు. షాట్‌ఫుట్‌ను 15.87 మీటర్ల దూరం విసిరి గేమ్స్‌లో కొత్త రికార్డును స్థాపించాడు. యాసిర్ 15.06 మీటర్లు, పర్వీన్ 14.94 మీటర్ల దూరం విసిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో ఖిలారి సిల్వర్ మెడల్ గెలిచాడు. అయితే చైనాలో జరిగిన గత ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టిన సచిన్ ఈసారి ఆ మెడల్‌ను డిఫెండ్ చేసుకున్నాడు. ఆరవ, ఏడవ అటెంప్ట్‌లో సచిన్ 15.87మీటర్ల దూరం విసిరి గేమ్స్ రికార్డు క్రియేట్ చేశాడు.
మూడో రోజు కూడా ఇండియాకు పతకాల పంట పండుతోంది. ప్రస్తుతం భారత బృందం పతకాల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఇండియాకు 47 మెడల్స్ దక్కాయి. దీంట్లో 12 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్య పతకాలు ఉన్నాయి.






