☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..

Simon Harmer: కొన్ని సార్లు బౌలర్లే బ్యాట్‌కి పని చెబుతారు.. మరికొన్ని సార్లు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వారే.. బాల్‌ అందుకొని వికెట్లు తీస్తుంటారు.. ఇప్పుడు అలాంటిదే మరోసారి జరిగింది.. ఏకంగా 18 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేలా చేసింది.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. గెబార్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి, డేల్ స్టెయిన్ […]
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..

Simon Harmer: కొన్ని సార్లు బౌలర్లే బ్యాట్‌కి పని చెబుతారు.. మరికొన్ని సార్లు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వారే.. బాల్‌ అందుకొని వికెట్లు తీస్తుంటారు.. ఇప్పుడు అలాంటిదే మరోసారి జరిగింది.. ఏకంగా 18 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేలా చేసింది.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. గెబార్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి, డేల్ స్టెయిన్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. తొలి టెస్టులో 214 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పోరాటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

మ్యాచ్ మూడో రోజు హార్మర్ 91 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై తొమ్మిదో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. 2008 మెల్‌బోర్న్ టెస్టులో డేల్ స్టెయిన్ చేసిన 76 పరుగులే గతంలో అత్యధికం. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ టెంబా బవుమా, మార్కో జాన్సెన్ జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. జాన్సెన్ 85 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్మర్.. బవుమాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 183 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా టెస్టు చరిత్రలో ఎనిమిదో వికెట్ లేదా అంతకంటే దిగువన నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ఇది రెండోది. 1998లో పాకిస్థాన్‌పై మార్క్ బౌచర్, పాట్ సిమ్‌కాక్స్ నెలకొల్పిన 195 పరుగుల భాగస్వామ్యం అగ్రస్థానంలో ఉంది.

కెప్టెన్ బవుమా అద్భుత ఇన్నింగ్స్
మరోవైపు, కెప్టెన్ టెంబా బవుమా ఒత్తిడిని తట్టుకుంటూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 334 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 179 పరుగులు సాధించాడు. తొలి రోజు దక్షిణాఫ్రికా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో బాధ్యత తీసుకుని జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. హార్మర్‌కు తొలి టెస్టు సెంచరీ సాధించే అవకాశం వచ్చినప్పటికీ, మార్నస్ లబుషేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బవుమా పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా 425/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి మూడు పరుగులు చేసింది. కగిసో రబాడా నిక్ మ్యాడిన్సన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పోరాటం మ్యాచ్‌పై ఉత్కంఠను పెంచింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!Coolpad Cool X Wide: 50MP కెమెరా, 4600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com