ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన లెహ్రా దో తిరంగా(తిరంగా మార్చ్) నిరసనపై అత్యవసర ఆదేశాలు జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగల సీజన్లో ఈ ఆందోళనలతో స్థానిక వ్యాపారులు, దినసరి కూలీల జీవనోపాధి దెబ్బతింటుందనే ఆందోళనల క్రమంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.CJI జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. తిరంగా మార్చ్ సందర్భంగా కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌ను మూసివేయడాన్ని సవాలు చేస్తూ సీజేపీ నేతలు దాఖలుచేసిన పిటిషన్ నపై అత్యవసరంగా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది.. కానీ అదే సమయంలో శాంతిభద్రతలు, చిరు వ్యాపారుల జీవనోపాధి వంటివన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. నిరసనలతో వ్యాపారులకు, ప్రజలకు జీవనోపాధికి నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. దసరా తర్వాత ఈ కేసును తిరిగి విచారిస్తామని అక్టోబర్ 26 కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఢిల్లీ పోలీసుల.. పూర్తిస్థాయిలో సీజేపీ తిరంగా మార్చకు అనుమతి నిరాకరించారు కేవలం 11 మందికి మాత్రమే జాతీయ జెండాతో కన్నాట్ ప్రాంతంలోకి అనుమతిచ్చారు. కన్నాట్ ప్లేస్, రాజీవ్ చౌక్, సెంట్రల్ పార్క్, జంతర్ మంతర్, పాలికా బజార్, సమీపంలోని మెట్రో స్టేషన్లు వంటి సున్నితమైన ప్రదేశాలలో 6వేలమందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది, 220 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. సీసీటీవీ నెట్వర్క్ తో నిఘా పెంచారు.
ఇదిలా ఉండగా.. సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ అరెస్టును నిరసిస్తూ, కన్నాట్ ప్లేస్ లో నిరసనలకు అనుమతి నిరాకరిస్తూ డీ నోటిఫై చేసిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర తిరంగా ఎగురవేసేందుకు పెద్ద ఎత్తున దేశభక్తులు తరలిరావాలని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. దీప్కే ప్రకటనతో శుక్ర, శనివారాల్లో సెంట్రల్ పార్క్‌ను మూసి ఉంచాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డిఎంసి) ఆదేశించింది. ఈ మార్చ్‌కు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు నిరాకరించారు.


