☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Abhijeet Dipke: అరెస్టుకు ముందే అభిజీత్ దిప్కే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడి ప్రకటన.. వీడియోలో సంచలన కామెంట్స్

పోలీసులు తనను అరెస్టు చేసిన వెంటనే అభిజీత్ దిప్కే(Abhijeet Dipke) రూపొందించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.
Abhijeet Dipke: అరెస్టుకు ముందే అభిజీత్ దిప్కే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడి ప్రకటన.. వీడియోలో సంచలన కామెంట్స్

Abhijeet Dipke: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అధినేత అభిజీత్ దిప్కే(Abhijeet Dipke)తో పాటు కీలక నేతలను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న అభిజీత్‌ను విమానాశ్రయంలో రన్ వేపైనే, విమానం లోపల నుంచే ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, ఆయనతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను కస్టడీలోకి తీసుకున్నారు.

Atchannaidu: ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. త్వరలోనే అధికారిక జాబితా.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

వీడియో సందేశం విడదల.. కొత్త నాయకుడిగా అజింక్యా షిండే:

పోలీసులు తనను అరెస్టు చేసిన వెంటనే అభిజీత్ దిప్కే రూపొందించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. “మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నన్ను, నా సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లే.. ఇకపై ఈ ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారు” అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి అత్యవసర పరిస్థితి కంటే ఘోరంగా ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దిప్కే, ఎంతమందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు.

ఈసీఐకి వ్యతిరేకంగా నిరసనలు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాకు డిమాండ్:

ఈ అరెస్టులను ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీజేపీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. నేతల అరెస్టులతో సంబంధం లేకుండా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతాయని, గాంధీ, అంబేడ్కర్ ఆశయాల సాధనకు యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉద్యమించాలని పార్టీ పిలుపునిచ్చింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kareena Kapur | న‌టి క‌రీనా బ్యాగ్ ఖ‌రీదు రూ.13 ల‌క్ష‌ల‌పైనే.. ఏంటి స్పెష‌ల్‌..?Atchannaidu: ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. త్వరలోనే అధికారిక జాబితా.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com