☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలన, ఆనాటి దారుణ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1800ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చేసిన పరిశోధనలో ఎన్నో దిగ్భ్రాంతికర నిజాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు. “బ్రిటిషర్లు మనకు రైల్వేలను బహుమతిగా ఇచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశంలోని పత్తి, ధాన్యం, ఖనిజాలు, సుగంధ ద్రవ్యాలు వంటి సంపదను వేగంగా మద్రాస్, బొంబాయి […]
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలన, ఆనాటి దారుణ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1800ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చేసిన పరిశోధనలో ఎన్నో దిగ్భ్రాంతికర నిజాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు.
“బ్రిటిషర్లు మనకు రైల్వేలను బహుమతిగా ఇచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశంలోని పత్తి, ధాన్యం, ఖనిజాలు, సుగంధ ద్రవ్యాలు వంటి సంపదను వేగంగా మద్రాస్, బొంబాయి వంటి ఓడరేవులకు చేరవేసి, అక్కడి నుంచి వారి దేశానికి తరలించడానికే వారు రైల్వే ట్రాక్‌లను వేశారు” అని విజయ్ వివరించారు.

అంతేకాకుండా, 1876 నాటి మహా కరువు సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోనే దాదాపు 80 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారని ఆయన గుర్తుచేశారు. ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా బ్రిటిషర్లు పన్నులను 50 నుంచి 60 శాతానికి పెంచి ప్రజలను తీవ్రంగా పీడించారని మండిపడ్డారు. బ్రిటిష్ వారు రాసుకున్న చరిత్ర కాకుండా, మన నిజమైన చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయ్ స్పష్టం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com