☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

women cops detain Dipke | అభిజిత్‌ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?

women cops detain Dipke | జంతర్‌మంతర్‌ వద్ద నిరసనల కోసం విమానంలో ముంబై నుంచి ఢిల్లీ చేరిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే, ఆయన బృందాన్ని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మగ పోలీసులకు బదులుగా మహిళా పోలీసులను మోహరించడం ఢిల్లీ పోలీసుల ప్లాన్‌గా తెలుస్తున్నది.
women cops detain Dipke | అభిజిత్‌ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద నిరసనల కోసం విమానంలో ముంబై నుంచి ఢిల్లీ చేరిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే, ఆయన బృందాన్ని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మగ పోలీసులకు బదులుగా మహిళా పోలీసులను మోహరించడం ఢిల్లీ పోలీసుల ప్లాన్‌గా తెలుస్తున్నది. (women cops detain Dipke) శనివారం సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ కాగానే నాటకీయ పరిణామాలు జరిగాయి. అక్కడ మోహరించిన మహిళా పోలీస్‌ అధికారులు వెంటనే ఆ విమానంలోకి ప్రవేశించారు. అభిజీత్ దీప్కే, ఆయన బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అజ్ఞాత ప్రాంతానికి తరలించారు.

కాగా, అభిజిత్‌ దీప్కే, ఆయన బృందాన్ని అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీస్‌ అధికారులను పంపడం ఢిల్లీ పోలీసుల ప్లాన్‌లో భాగంగా జరిగిందా? అన్న చర్చకు దారి తీసింది. ఒకవేళ పురుష పోలీస్‌ అధికారులను రంగంలోకి దించితే ఘర్షణలకు దారితీయవచ్చని ఢిల్లీ పోలీసులు ముందుగానే ఊహించి ఉంటారని తెలుస్తున్నది. అలాగే విమానంలో నడిచే ప్రాంతం చాలా ఇరుకుగా ఉంటుంది. ప్రయాణికులు కదలడానికి చాలా తక్కువ స్థలం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న తోపులాట కూడా త్వరగా పెద్ద ఘర్షణగా మారే అవకాశమున్నది.

మరోవైపు నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై సీజేపీ చేపట్టిన తొలి భారీ నిరసన సందర్భంగా జూలై 20న తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. పురుష పోలీస్‌ అధికారులు యువతులను కొట్టడంతో పాటు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సీజేపీ ఆరోపించింది. ఆ పోలీస్‌ అధికారులపై కేసుల నమోదుతో పాటు వారిపై చర్యలకు డిమాండ్‌ చేసింది.

ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. అందుకే సీజేపీ నాయకత్వ బృందం అరెస్ట్‌ కోసం మహిళా పోలీసులకు ప్రాధాన్యత ఇచ్చారు. విమానంలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదాన్ని నివారించే ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసులు మహిళా అధికారులను రంగంలోకి దించారు. దీంతో చిన్న వాగ్వాదాలు మినహా ఎలాంటి ప్రతిఘటనలు ఎదురుకాలేదు. ఎలాంటి గందరగోళం లేకుండానే అభిజిత్‌ దీప్కే, ఇతర సీజేపీ నాయకులను మహిళా పోలీస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసుల ముందస్తు ప్రణాళికలో లేని ఈ అనూహ్య చర్య, వ్యూహం ఉద్దేశపూర్వకంగా తీసుకున్నదా? లేదా అన్నది తెలియలేదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com