MVSR Dandiya Event | ‘ఇది హిందువుల కార్యక్రమం.. నువ్వెందుకు వచ్చావ్?’ అంటూ ఓ ముస్లిం బౌన్సర్‌ను కొందరు యువకులు నిలదీశారు. ఈవెంట్ నిర్వాహకులే తనను విధులకు పంపించారని చెబుతున్నా వినిపించుకోకుండా ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని నాదర్గుల్ ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుక సందర్భంగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ దాండియా కార్యక్రమానికి నిర్వాహకులు భద్రత కోసం బౌన్సర్లను నియమించారు. వారిలో ఫరీద్ అనే ముస్లిం బౌన్సర్ కూడా ఉన్నారు. అయితే, కొందరు యువకులు ఆయనను మతం పేరుతో ప్రశ్నిస్తూ దురుసుగా మాట్లాడారు. ‘నీకు సోషల్ మీడియా ఉంది కదా.. హిందువుల పండుగలకు ముస్లిం బౌన్సర్లు రావొద్దని ప్రచారం జరుగుతోంది కదా.. మరి నువ్వెందుకు వచ్చావ్?’ అని ప్రశ్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇలా ముస్లిం బౌన్సర్‌ను వేధించడమే కాకుండా.. తామేదో ఘనకార్యం చేసినట్లుగాగా వీడియో తీసి మరీ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
ఇదిలా ఉండగా, ఇదే ఎంవీఎస్ఆర్ కళాశాలలో అక్టోబరు 17న దాండియా వేడుక సందర్భంగా తాత్కాలిక ఇనుప ట్రస్ కూలి ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ట్రస్ నిర్మాణానికి నాలుగు స్తంభాల బదులు రెండింటినే ఉపయోగించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
A fatal tragedy at a dandiya event in Hyderabad did not stop some right-wing supporters from allegedly harassing a Muslim bouncer employed there.
Farid from Pahadishareef was one of the many bouncers employed by the organisers. A video has surfaced in which a right-wing supporter, whose identity is not clear, abuses him and tells him to leave the premises.
— The Siasat Daily (@TheSiasatDaily) October 20, 2026






