☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

భారతీయులను రక్షించండి.. జెలెన్‌స్కీ కీలక అభ్యర్థన!

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు నాలుగేళ్లకు పైగా తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ యుద్ధం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ భారతీయులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. మోసం, కుతంత్రాలతో అమాయక భారతీయులను రష్యా ఈ భీకర యుద్ధంలోకి లాగుతోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రష్యన్ అధ్యక్షుడు పుతిన్‌కు ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ఆయన కోరారు. ఐరాస 81వ సర్వప్రతినిధి సభ సమావేశంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు […] The post భారతీయులను రక్షించండి.. జెలెన్‌స్కీ కీలక అభ్యర్థన! appeared first on Adya News Telugu.
భారతీయులను రక్షించండి.. జెలెన్‌స్కీ కీలక అభ్యర్థన!

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు నాలుగేళ్లకు పైగా తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ యుద్ధం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ భారతీయులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. మోసం, కుతంత్రాలతో అమాయక భారతీయులను రష్యా ఈ భీకర యుద్ధంలోకి లాగుతోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రష్యన్ అధ్యక్షుడు పుతిన్‌కు ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ఆయన కోరారు. ఐరాస 81వ సర్వప్రతినిధి సభ సమావేశంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ యుద్ధంలో రష్యా ఏకంగా 47 దేశాల ప్రజలను పావుగా వాడుకుంటోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. భారత్, నేపాల్, ఘనా, తజికిస్థాన్‌, కెన్యా, క్యూబా, యెమెన్‌ వంటి దేశాల పౌరులు యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమన్నారు. వారంతా మోసపూరిత వాగ్దానాలతో రష్యాలో చిక్కుకుపోయిన విదేశీయులేనని తెలిపారు. ఈ దేశాల ప్రతినిధులందరితో నేరుగా మాట్లాడాలని ఉందని చెప్పారు. మీ దేశ ప్రజలను మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని హితవు పలికారు. వారు యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టకుండా చూడాలని కోరారు. పుతిన్ మిమ్మల్ని ఈ యుద్ధంలో భాగం చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా రష్యాను ఎప్పటికీ అనుమతించవద్దని ఆయన అభ్యర్థించారు.

మరోవైపు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. దీనిపై స్పందించిన జెలెన్‌స్కీ.. రష్యా పెట్రోల్, డీజిల్ వ్యవస్థలను నాశనం చేయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. రష్యా దురాక్రమణకు ప్రధాన వనరుగా ఉన్న ఆదాయాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించడం వల్లే ఈ యుద్ధం మరింతకాలం సాగుతోందని భారత్, చైనా దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అయితే జెలెన్‌స్కీ వ్యాఖ్యలకు పుతిన్ ప్రభుత్వం వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌ వంటి దేశాలకు తాము చేస్తున్న ముడి చమురు ఎగుమతులు చాలా కీలకమని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి ఈ ఎగుమతులు ఎంతగానో ఉపయోగపడ్డాయని రష్యా స్పష్టం చేసింది.

The post భారతీయులను రక్షించండి.. జెలెన్‌స్కీ కీలక అభ్యర్థన! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG
← తాడేపల్లి పొలిటికల్ హీట్.. ఏపీలో కొత్త లెక్కలు..!క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు: రష్మిక →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com