☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తాడేపల్లి పొలిటికల్ హీట్.. ఏపీలో కొత్త లెక్కలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ఆసక్తికరమైన రాజకీయ ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సీపీఐ అగ్రనేతలు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథరెడ్డి తదితరులు జగన్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా […] The post తాడేపల్లి పొలిటికల్ హీట్.. ఏపీలో కొత్త లెక్కలు..! appeared first on Telugu Rajyam.
తాడేపల్లి పొలిటికల్ హీట్.. ఏపీలో కొత్త లెక్కలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ఆసక్తికరమైన రాజకీయ ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సీపీఐ అగ్రనేతలు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథరెడ్డి తదితరులు జగన్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు.

ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. పైకి ప్రజా సమస్యలు, కరువు పరిస్థితులపై చర్చలని చెబుతున్నప్పటికీ, ఈ భేటీ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సీపీఐ రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకోబోతుందా..? అనే యాంగిల్‌లో రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ డిబేట్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఈనెల 26న విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘రౌండ్ టేబుల్ సమావేశానికి’ హాజరు కావాల్సిందిగా వైఎస్ జగన్‌ను ఆహ్వానించడానికి తాము వచ్చినట్లు సీపీఐ నేతలు ప్రకటించారు.

ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్రంలో భారీగా ఓట్ల తొలగింపు జరుగుతోందని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అయితే, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు జగన్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించిన చరిత్రను పక్కన పెట్టి, నేరుగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మరీ మాజీ సీఎం జగన్‌ను కలవడం వెనుక కేవలం “ఆహ్వానం” మాత్రమే ఉందంటే నమ్మడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయడంలో వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సీపీఐ నేతలే స్వయంగా ప్రకటించారు.

ఇది ఇరు పార్టీల మధ్య పొత్తుకు ప్రధాన లైన్‌గా మారే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ, విపక్షాల బలాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఇటు వైసీపీకి, అటు లెఫ్ట్ పార్టీలకు ఉంది. కరువు, నిరుద్యోగం, ఓట్ల తొలగింపు, ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాడటం ద్వారా ఇరు పార్టీలు ప్రజాక్షేత్రంలో మైలేజ్ సాధించాలని భావిస్తున్నాయి. అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్ బలాన్ని పెంచుకోవడానికి, కూటమి ఓట్లను చీల్చడానికి లెఫ్ట్ పార్టీల మద్దతు వైసీపీకి ఎంతగానో ఉపయోగపడుతుంది.

గతంలో వైఎస్ జగన్ ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోరాటాలు చేశారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కలుసొచ్చే శక్తులను కలుపుకుపోవాలనే వ్యూహంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు సీపీఐ కూడా కూటమి ప్రభుత్వ విధానాలపై సమరశంఖం పూరించేందుకు వైసీపీ వంటి బలమైన ప్రతిపక్ష పార్టీ తోడ్పాటును కోరుకుంటోంది. మొత్తానికి తాడేపల్లి భేటీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ఈనెల 26న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం వైసీపీ-సీపీఐ మైత్రి అధికారికంగా ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

The post తాడేపల్లి పొలిటికల్ హీట్.. ఏపీలో కొత్త లెక్కలు..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బాబు లోకల్ టాపిక్ ఎత్తితే.. పవన్ సైలెంట్ అయ్యారా..?భారతీయులను రక్షించండి.. జెలెన్‌స్కీ కీలక అభ్యర్థన! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com