☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

మహాసేన రాజేష్‌కు జడ్పీ చైర్మన్ గిఫ్ట్..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమవుతున్న వేళ, అభ్యర్థుల ఎంపికతో పాటు మున్సిపల్, జడ్పీ చైర్మన్ స్థానాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీటు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నేత, సోషల్ మీడియా స్టార్ మహాసేన రాజేష్ రాజకీయ భవిష్యత్తుపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఒకటి గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పీ. గన్నవరం సీటు చేతికందివచ్చినట్లే వచ్చి చేజారిన […] The post మహాసేన రాజేష్‌కు జడ్పీ చైర్మన్ గిఫ్ట్..? appeared first on Telugu Rajyam.
మహాసేన రాజేష్‌కు జడ్పీ చైర్మన్ గిఫ్ట్..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమవుతున్న వేళ, అభ్యర్థుల ఎంపికతో పాటు మున్సిపల్, జడ్పీ చైర్మన్ స్థానాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీటు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నేత, సోషల్ మీడియా స్టార్ మహాసేన రాజేష్ రాజకీయ భవిష్యత్తుపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఒకటి గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పీ. గన్నవరం సీటు చేతికందివచ్చినట్లే వచ్చి చేజారిన రాజేష్‌కు, ఈ లోకల్ బాడీ ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముచిత న్యాయం చేయబోతున్నారనే వార్తలు కోనసీమ జిల్లా రాజకీయాల్లో జోరందుకున్నాయి.

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్ల అధికారిక జాబితా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ జనరల్ కేటగిరీ కింద కేవలం మూడు జిల్లాల పీఠాలు మాత్రమే ఖరారయ్యాయి. అందులో మహాసేన రాజేష్ స్వస్థలమైన, ఆయనకు పట్టున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కూడా ఉండటం విశేషం. కోనసీమ జడ్పీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్‌కు దక్కడంతో.. 2024 ఎన్నికల్లో త్యాగం చేసిన రాజేష్‌ను ఇక్కడ నుంచి బరిలోకి దించవచ్చనే చర్చలు నడుస్తున్నాయి.

రాజకీయ వర్గాల లీకుల ప్రకారం, కోనసీమ జిల్లాలోని ఏదైనా ఒక సురక్షితమైన మండలం నుండి మహాసేన రాజేష్‌ను జెడ్‌పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయించి, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేలా టీడీపీ అధిష్ఠానం ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, 2024 లో గన్నవరం సీటు విషయంలో స్థానిక జనసేన, టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలంటే కోనసీమ జిల్లాలోని కూటమి నేతలను, ముఖ్యంగా జనసేన అగ్రనాయకత్వాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని కూటమిలో సయోధ్య కుదిరిస్తే గనుక.. మహాసేన రాజేష్ కోనసీమ జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

The post మహాసేన రాజేష్‌కు జడ్పీ చైర్మన్ గిఫ్ట్..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అనంతపురం జడ్పీ పీఠంపై పరిటాల ఫ్యామిలీ..?సెంట్రల్ లో టీడీపీకి వంగవీటి రాధ షాక్..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com