☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది.
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. అభిజీత్ దీప్కే నానమ్మ సావిత్రీబాయి దీప్కే (85) హింగోలి జిల్లాలో కన్నుమూశారు. ఢిల్లీలో దీప్కే, ఆయన సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. సావిత్రీబాయి మృతి వార్త తర్వాత దీప్కే తల్లిదండ్రులు హింగోలికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే, ఆయన సహచరులను విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కే ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ సందర్భంగా రికార్డయినట్లు చెబుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో మహిళా పోలీసు సిబ్బందితో సహా పలువురు పోలీసులు విమానంలోకి వచ్చి ఆయన దగ్గరకు వెళ్లడం కనిపించింది. ఈ సమయంలో దీప్కే.. “ఢిల్లీ పోలీసులు విమానంలోకి వచ్చారు. మమ్మల్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది. దీప్కేతో పాటు సీజేపీ కార్యకర్తలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జంతర్ మంతర్ దగ్గర నిర్వహించనున్న నిరసనకు ఎన్నికల సంఘం వ్యవహారశైలే ప్రధాన కారణమని సీజేపీ తెలిపింది. ఎన్నికల సంఘం దుర్వ్యవహారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనకు హాజరయ్యేందుకు వచ్చిన దీప్కే, ఇతర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com