☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 (శనివారం) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ కన్వీనర్, కో కన్వీనర్లు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోనే పోలీసులు […]
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 (శనివారం) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ కన్వీనర్, కో కన్వీనర్లు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ పోలీసులు దీప్కే గ్యాంగ్‌ను అరెస్ట్ చేయడానికి డజను మంది మహిళా పోలీసుల్ని నియమించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళా పోలీసుల్ని రంగంలోకి దించడం ద్వారా ఢిల్లీ పోలీసులు కీలక వ్యూహం అవలంభించడంతో పాటు సీజేపీకి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు అయింది. మహిళా పోలీసుల చేత అరెస్ట్ చేయించడంపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వకున్నా కొన్ని ఊహాగానాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి.

ఘర్షణ నివారించేందుకే..

విమానం నుంచి ముగ్గురుని అదుపులోకి తీసుకునే సమయంలో పురుష పోలీసులు ఉంటే అది ఘర్షణకు దారి తీసే అవకాశం ఉందని పోలీస్ శాఖ వ్యూహాత్మకంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. విమానంలో చాలా తక్కువ స్థలం ఉండటంతో పురుష పోలీసులను మోహరిస్తే ఘర్షణ పెరిగే ఛాన్స్ ఉందని, మహిళా పోలీసుల్ని పంపించడం ద్వారా సీజేపీ నాయకులు పెద్దగా రియాక్ట్ కాకుండానే అదుపులోకి తీసుకోవచ్చని భావించిఉంటారు.

మహిళా పోలీసుల్ని మోహరించడం ద్వారా క్లియర్ మెసేజ్..

గతంలో జూలై 20న నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కొందరు మగ పోలీసులు 12 ఏళ్ల బాలికపై దాడి చేసినట్లు సీజేపీ ఆరోపించింది. ఇదే సమయంలో నిరసనల సమయంలో యువకులు మహిళా పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరించారు. తమను తాము సీజేపీ కార్యకర్తలమని చెప్పుకుంటూ మహిళా పోలీసులపై దాడులు, దుర్భాషలాడిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ అగ్రనేతల్ని మహిళా పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించి, గట్టి సందేశాన్ని పంపాలని పోలీసులు భావించి ఉంటారు.

సీజేపీ నేతల అరెస్ట్..

దీప్కే, సౌరవ్, అశుతోష్‌లను విమానంలోనే అదుపులోకి తీసుకుని ముగ్గురిని మూడు వేర్వేరు గుర్తుతెలియని ప్రాంతాలకు తరలించారు. తమ నేతలును లాయర్లు కాంటాక్ట్ చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని సీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఢిల్లీలో వివిధ ప్రాంతాల నుంచి 400 మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com