☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!

Least Eligible Bachelor | సినిమాతోనే కాదు.. మంచి మనసుతోనూ అందరి మనసులు గెలవవచ్చని నిరూపించారు ప్రముఖ నటుడు 'వైవా' హర్ష చెముడు.
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!

Harsha Chemudu | సినిమాతోనే కాదు.. మంచి మనసుతోనూ అందరి మనసులు గెలవవచ్చని నిరూపించారు ప్రముఖ నటుడు ‘వైవా’ హర్ష చెముడు (Harsha Chemudu). ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Least Eligible Bachelor). బాబు డెగాల (Babu Degala) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదికలు ETV Win మరియు Netflixల‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ట్రెండింగ్‌లో నిలవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ వేడుకలో దర్శకుడు బాబు డెగాలాపై హర్ష చెముడు తన ప్రేమను, కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాబు కోరుకున్న కోరికను గుర్తుంచుకున్న హర్ష.. ఆయనకు అదిరిపోయే రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

కేవలం నవ్వులు పంచడమే కాకుండా, కుటుంబమంతా కలిసి ఎంతో హాయిగా చూడదగిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ నిలిచిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈటీవీ విన్ మరియు నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా ప్రసారమవుతున్న ఈ సిరీస్‌కు వస్తున్న స్పందన చూసి యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు బాబు డెగాల ప్రతిభకు, హర్ష చెముడు మంచి మనసుకు నెటిజన్లు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com