☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

‘రాకా’లో అవకాశం ఇప్పించండి!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. భారతీయ చిత్రసీమలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. ఆమె ఇందులో కీలకమైన నెగెటివ్‌ షేడ్స్‌‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై నటి ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. వాటిని చూసి […] The post ‘రాకా’లో అవకాశం ఇప్పించండి! appeared first on Adya News Telugu.
‘రాకా’లో అవకాశం ఇప్పించండి!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. భారతీయ చిత్రసీమలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. ఆమె ఇందులో కీలకమైన నెగెటివ్‌ షేడ్స్‌‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ పుకార్లపై నటి ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. వాటిని చూసి తాను కూడా సరదాగా నవ్వుకున్నట్లు తెలిపారు. తనకు ఎవరైనా ‘రాకా’లో అవకాశం ఇప్పిస్తే బాగుంటుందని నవ్వుతూ చమత్కరించారు. దీంతో ఆమె నటిస్తున్నారంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.

ఈ భారీ చిత్రంలో నలుగురు కథానాయికలకు చోటు ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటించనున్నారు. అలాగే మలయాళ నటి ఫెమినా జార్జ్‌‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి ఎంపికను మాత్రమే చిత్ర బృందం అధికారికంగా ధ్రువీకరించింది. జాన్వీ కపూర్, రష్మిక పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

The post ‘రాకా’లో అవకాశం ఇప్పించండి! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను.. ఎన్టీర్ ఆగ్ర‌హం!ఆసియా క్రీడలు.. టీమ్‌ఇండియా ఖాతాలో స్వర్ణం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com