☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను.. ఎన్టీర్ ఆగ్ర‌హం!

సోషల్ మీడియాలో ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాట మార్ఫింగ్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఆ వీడియోను కొందరు అసభ్యకరంగా మార్చారు. ఈ క్లిప్‌ను నెట్టింట ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. దీనిపై సినీ నటుడు ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వికృత చర్యపై ఎన్టీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో స్త్రీలను దేవతలుగా, తల్లులుగా గౌరవిస్తారని ఆయన గుర్తుచేశారు. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం […] The post నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను.. ఎన్టీర్ ఆగ్ర‌హం! appeared first on Adya News Telugu.
నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను.. ఎన్టీర్ ఆగ్ర‌హం!

సోషల్ మీడియాలో ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాట మార్ఫింగ్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఆ వీడియోను కొందరు అసభ్యకరంగా మార్చారు. ఈ క్లిప్‌ను నెట్టింట ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. దీనిపై సినీ నటుడు ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ వికృత చర్యపై ఎన్టీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో స్త్రీలను దేవతలుగా, తల్లులుగా గౌరవిస్తారని ఆయన గుర్తుచేశారు. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం మాట కాదని, మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. అలాంటి సమాజంలో ఒక మహిళను కించపరిచేలా ఏఐని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని ఖండించారు.

ఈ దారుణానికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు. మార్ఫింగ్ వీడియోను తయారుచేసిన వారితో పాటు, దాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇలాంటి అసభ్యకరమైన వీడియోలను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు బాధితురాలు వేరే మహిళ కావచ్చని చెప్పారు. కానీ రేపు అది మన ఇంట్లోని తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చని గుర్తుచేశారు.

ఏఐ సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధితులకు రక్షణ కల్పించేలా పటిష్ఠమైన నిబంధనలు తీసుకురావాలని ఎన్టీఆర్ కోరారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

The post నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను.. ఎన్టీర్ ఆగ్ర‌హం! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మచ్చర్‌కు దుబాయ్‌ యువరాజు ఆత్మీయ ముద్దు‘రాకా’లో అవకాశం ఇప్పించండి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com