☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్

Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్సీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ ఉద్రిక్తంగా మారింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే, తమకు కనీసం 150 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు అన్ని సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖంగా లేదు. కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా ఎక్కువే అని ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ […]
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్

Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్సీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ ఉద్రిక్తంగా మారింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే, తమకు కనీసం 150 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు అన్ని సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖంగా లేదు. కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా ఎక్కువే అని ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌కు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కాయి.? ఏ సీటు ఎవరికి కేటాయించారన్న దాని కన్నా కూటమి గెలుపే ప్రధాన లక్ష్యం కావాలని ఆయన అన్నారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మనం చేయి చేయి కలిపి ముందుకు సాగుతాం. ‘‘గమ్యంపై దృష్టి ఉంటే ప్రయాణం సులభం అవుతుంది’’ ఆయన అన్నారు. ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి అని అఖిలేష్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

సీట్ల పంపకాల్లో ‘‘గెలిచే సామర్థ్యాన్ని’’ మరోసారి తన వైఖరిగా ఎస్పీ చీఫ్ స్పష్టం చేశారు. ఏ సీటులో ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే వారికే ఆ సీటు కేటాయించాలని ఆయన సూచించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఆయన.. మతతత్వం మళ్లీ తలెత్తకుండా నిరోధించడం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రిజర్వేషన్లపై బీజేపీ దాడిని అడ్డుకోవడమే ఈ పోరాటం లక్ష్యమని చెప్పారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com