☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..

BJP MP: బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి. మధ్యప్రదేశ్‌లోని బర్వానీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యువ సనాతనీలు త్వరగా వివాహం చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి’’ అని పిలుపునిచ్చారు. మారుతున్న జనాభా పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువకులు శారీరకంగా బలంగా ఉండాలని, సమాజాన్ని బలోపేతం చేయడానికి జిమ్‌లు, సంప్రదాయ అఖాడాలను ప్రోత్సహించాలని సూచించారు. స్వాతంత్య్రం తర్వాత జనాభా పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, 1947 […]
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..

BJP MP: బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి. మధ్యప్రదేశ్‌లోని బర్వానీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యువ సనాతనీలు త్వరగా వివాహం చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి’’ అని పిలుపునిచ్చారు. మారుతున్న జనాభా పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువకులు శారీరకంగా బలంగా ఉండాలని, సమాజాన్ని బలోపేతం చేయడానికి జిమ్‌లు, సంప్రదాయ అఖాడాలను ప్రోత్సహించాలని సూచించారు.

స్వాతంత్య్రం తర్వాత జనాభా పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, 1947 నుంచి 1967 మధ్య పరిస్థితులు వేరుగా ఉండేవని, దీని తర్వాత ఒక వర్గం జనాభా గ్రాఫ్ పెరగగా, మరో వర్గం జనాభా తగ్గిందని అన్నారు. గతంలో 20, 21 ఏళ్లలో యువకులు వివాహం చేసుకునే వారని, నలుగురి కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారని చెప్పారు. ప్రస్తుతం యువత 30-37 ఏళ్ల మధ్య పెళ్లిళ్లు చేసుకుని, ఒకే సంతానానికి పరిమితమవుతున్నారని అన్నారు. అందుకే సనాతనీల జననాల రేటు 1.9గా ఉందని, యువత పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలని అన్నారు.

భక్తితో పాటు యువత శారీరకంగా బలంగా ఉండాలని పటేల్ సూచించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, ఆడంబర ధోరణిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీజే, డ్రగ్స్, డౌరీపై యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్‌ ఎక్కువ?CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com