☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!

Abhijit Dipke: 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో అభిజీత్ మాట్లాడూ.. "మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నాతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై ఈ ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారు" అని స్పష్టం చేశారు.
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!

Abhijit Dipke: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో అభిజీత్ మాట్లాడూ.. “మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నాతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై ఈ ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారు” అని స్పష్టం చేశారు.

జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఢిల్లీ పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీ వచ్చిన అభిజీత్‌ను ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో విమానం లోపల నుంచే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పోలీసులు విమానంలోకి ప్రవేశించిన సమయంలో తీవ్ర కలకలం, తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నాయి. పోలీసులు, సీజేపీ నేతల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగిన అనంతరం ఆ ముగ్గురినీ పోలీసులు రౌండప్ చేసి తీసుకెళ్లారు. పోలీసుల చర్యపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అరెస్టులను ఖండించింది. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన అభిజీత్ దిప్కే.. చివరికి ఇందిరా గాంధీ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పటి పరిస్థితి ఆనాటి కంటే దారుణంగా ఉందని మండిపడ్డారు. అరెస్టులకు తాము భయపడేది లేదని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.

ఈ పరిణామాలపై సీజేపీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. సీనియర్ నాయకత్వం అందుబాటులో ఉన్నా లేకపోయినా తమ ఆందోళన ఆగదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, దేశంలోని యువత, ప్రజలంతా ముందుకు వచ్చి మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్‌చల్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com