☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!

Delhi Protest: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీటీఐ (PTI) బిల్డింగ్ సమీపంలో ఆందోళన చేపట్టిన సుమారు 50 మంది నిరసనకారులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఊహించని పరిణామంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసన ప్రదర్శనలో రాకేష్ తికాయత్ వర్గానికి చెందిన కిసాన్ నేతలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి తరలించడానికి ప్రత్యేకంగా జైలు వ్యాన్ల లాంటి వాహనాలను రంగంలోకి దించారు. కొందరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ, కిందపడి లాగుతున్న దృశ్యాలు కనిపించాయి. కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వైపు దూసుకెళ్లిన ఆందోళనకా
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!

Delhi Protest: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీటీఐ (PTI) బిల్డింగ్ సమీపంలో ఆందోళన చేపట్టిన సుమారు 50 మంది నిరసనకారులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఊహించని పరిణామంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసన ప్రదర్శనలో రాకేష్ తికాయత్ వర్గానికి చెందిన కిసాన్ నేతలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి తరలించడానికి ప్రత్యేకంగా జైలు వ్యాన్ల లాంటి వాహనాలను రంగంలోకి దించారు. కొందరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ, కిందపడి లాగుతున్న దృశ్యాలు కనిపించాయి. కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వైపు దూసుకెళ్లిన ఆందోళనకారులను నిలువరించేందుకు భారీగా పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు.

గోల్ డాక్ ఖానా ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ మాట్లాడుతూ.. ఇది కేవలం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తీసుకున్న ప్రివెంటివ్ యాక్షన్ అని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతూ, ప్రజలందరూ సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఆందోళనకు అసలు కారణం ఏమిటి, రాళ్లు విసరడానికి దారితీసిన పరిస్థితులు ఏంటనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు.. రాజధానిలో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో అభిజీత్ మాట్లాడూ.. “మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నాతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై ఈ ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారు” అని స్పష్టం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతంAbhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com