☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

గంగమ్మ ఒడిలో ఖైరతాబాద్ గణేషుడు

గంగమ్మ ఒడిలో ఖైరతాబాద్ గణేషుడు Caption of Image. ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ‘జై జై గణేషా.. బై బై గణేషా’ అంటూ లక్షలాది మంది భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజులు ఘనంగా భక్తులనుంచి పూజలందుకున్న బడా గణపయ్యను భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి సాగనంపే నిమజ్జన వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. ‘మళ్లీ త్వరగా రావయ్యా’ అంటూ డప్పుల మోతలు, భక్తుల జైజై నినాదాల అంగరంగ వైభవంగా గంగఒడికి సాగనంపారు భక్తులు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన బడా గణేషుడి శోభాయాత్ర దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. లక్షలాది మంది భక్తుల సందడితో నగర వీధుల్లో సాగిన ఈ మహా ఊరేగింపు టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్ చౌరస్తా మీదుగా సచివాలయం వద్దకు చేరుకుంది. అక్కడి ను
గంగమ్మ ఒడిలో ఖైరతాబాద్ గణేషుడు
గంగమ్మ ఒడిలో ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ‘జై జై గణేషా.. బై బై గణేషా’ అంటూ లక్షలాది మంది భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజులు ఘనంగా భక్తులనుంచి పూజలందుకున్న బడా గణపయ్యను భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి సాగనంపే నిమజ్జన వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. ‘మళ్లీ త్వరగా రావయ్యా’ అంటూ డప్పుల మోతలు, భక్తుల జైజై నినాదాల అంగరంగ వైభవంగా గంగఒడికి సాగనంపారు భక్తులు.

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన బడా గణేషుడి శోభాయాత్ర దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. లక్షలాది మంది భక్తుల సందడితో నగర వీధుల్లో సాగిన ఈ మహా ఊరేగింపు టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్ చౌరస్తా మీదుగా సచివాలయం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్‌కు బడా గణేష్‌ను తరలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బాహుబలి క్రేన్ పాయింట్-4 వద్ద గణనాథుడిని క్రేన్ సహాయంతో గంగమ్మ ఒడికి చేర్చడంతో నిమజ్జన ఘట్టం పూర్తయింది.

ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర భక్తుల భారీ సందడితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పుల మోతలు, భక్తుల జైజై నినాదాలు, రంగురంగుల అలంకరణల మధ్య సాగిన యాత్ర హైదరాబాద్ నగరంలో పండుగ వాతావరణాన్ని నింపింది. ఆధ్యాత్మిక శోభతో నగర వీధులు కళకళలాడాయి.

మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణనాథుడిపై పూలు చల్లుతూ, డోలు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ భక్తులు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జై జై గణేషా’ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.

మరోవైపు, భారీగా తరలివచ్చిన భక్తుల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. బడా గణేష్ వాహనం చుట్టూ రోప్ పార్టీని ఏర్పాటు చేసి, శోభాయాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 66 – 28తో థాయ్‌లాండ్ చిత్తు.. ఆసియా గేమ్స్ కబడ్డీ ఫైనల్‌లోకి టీమిండియా!కోహ్లీ, రోహిత్ సీక్రెట్ డిస్కషన్.. మాజీ కెప్టెన్ కామెంట్స్ వైరల్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com