☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR | సింగరేణి సంస్థలో స్కామ్‌లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టంచేశారు. జడ్జికి రేవంత్‌రెడ్డి లేఖ రాస్తే తాను పూర్తి ఆధారాలు సమర్పిస్తానని తేల్చిచెప్పారు. ‘
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR | రేవంత్‌రెడ్డీ..సింగరేణి కుంభకోణాలపై నేను ఉత్తరం రాస్తే విచారణకు ఆదేశిస్తానన్నవు కదా.. ఎస్‌.. నేను సిట్టింగ్‌ జడ్జితో విచారణకు రెడీ.. దమ్ముంటే వెంటనే జడ్జికి లేఖ రాయి. నేను ఆధారాలు సమర్పించి నువ్వు, నీ బామ్మర్ది, నీ సర్కార్‌ అక్రమాలను బట్టబయలు చేస్తా..

– కేటీఆర్‌ సవాల్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (నమస్తేతెలంగాణ) : సింగరేణి సంస్థలో స్కామ్‌లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టంచేశారు. జడ్జికి రేవంత్‌రెడ్డి లేఖ రాస్తే తాను పూర్తి ఆధారాలు సమర్పిస్తానని తేల్చిచెప్పారు. ‘బొగ్గు అంశంలోనే కాదు.. నువ్వు చేసిన అక్రమాలు, నీ బామ్మర్ది సృజన్‌రెడ్డి సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల కోట్ల కుంభకోణం, నువ్వు చేసిన పవర్‌ స్కామ్‌, విదేశీ బొగ్గు కొనుగోలు పేరిట సాగుతున్న కమీషన్ల బాగోతాన్ని కూడా బయటపెట్టేందుకు సిద్ధం’ అని ప్రకటించారు.

‘సింగరేణి నిండా కుంభకోణాలున్నాయని మొన్న లేఖ రాసిన.. అంతకుముందు రోజు బహిరంగ సభలో బయటపెట్టిన.. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొన్న అడ్డగోలుగా మాట్లాడి స్కామ్‌లను కప్పిపుచ్చుకొనేందుకు యత్నించారు’ అని మండిపడ్డారు. ఇప్పుడు ఏటా 70 వేల మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థను కాదని విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని బొందపెట్టి కమీషన్ల కోసం ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో 24 గంటల కరెంట్‌ ఇచ్చి తెలంగాణకు వెలుగులు పంచిన సిరుల సింగరేణిని బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘సంస్థను సంక్షోభంలోకి నెట్టి అంతా ఆగమైన తర్వాత కరెంట్‌ కొనాలి.. బొగ్గు తేవాలి.. సింగరేణి బొగ్గు వద్దు..భారతదేశం బొగ్గు వద్దు.. విదేశీ బొగ్గు ముద్దు’ అని అంటున్నారని దెప్పిపొడిచారు. సింగరేణిలో టన్నుకు రూ.3,800 చొప్పున కోల్‌ను వదిలిపెట్టి టన్నుకు రూ.10 వేల నుంచి 12 వేల కమీషన్లు దండుకొనేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి ఆయన సతీమణి పెద్ది స్వప్న, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి కేటీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెద్దిని పోరాట స్ఫూర్తిగా తీసుకొని పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా ముందుకెళ్లి నర్సంపేట గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

రేవంత్‌ ఈఎంఈ సీఎం

‘రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు.. ఈఎంఐ ముఖ్యమంత్రి’ అని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. ప్రతినెలా ఢిల్లీ పెద్దలకు కప్పంగట్టి తన పదవిని రెన్యువల్‌ చేయించుకుంటున్నారని దెప్పిపొడిచారు. కప్పం కట్టకుంటే రికవరీ ఏజెంట్‌ లాంటి తెలంగాణలోని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ఆయన సీఎం కుర్చీని గుంజి పడేస్తాడని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి నుంచి ఈఎంఐలు కట్టించుకొనేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీని నియమించిందని, కప్పంకట్టి పదవిని కాపాడుకొనేందుకే తెలంగాణ సంపదను రేవంత్‌ లూటీ చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.

ఏపీలో జల పండుగ.. ఇక్కడ జల గండం..

700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే అడ్డుకోవాల్సిన రేవంత్‌రెడ్డి కండ్లప్పగించి చూశారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ‘తెలంగాణ నుంచి కిందికిపోయిన నీళ్లతో ఆంధ్రప్రదేశ్‌లో జల పండుగ కనిపిస్తున్నది.. కానీ తెలంగాణ మాత్రం జలగండంలో చిక్కుకున్నది..ఇందుకు రేవంత్‌ సర్కార్‌ అసమర్థతే కారణం’ అని విమర్శలు గుప్పించారు. ఎల్‌ నినో వచ్చిందని మన ముఖ్యమంత్రి చేతులెత్తేస్తున్నాడని దుయ్యబట్టారు.

ఎల్‌ నినో దేశమంతటా ఉన్నదని, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలోనూ ఉన్నదని చెప్పారు. అక్కడి ప్రభుత్వాలు కరువు సన్నద్ధత చర్యల్లో నిమగ్నమవుతుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజాధనాన్ని లూటీ చేయడంలో బిజీగా ఉన్నాడని ఎద్దేవాచేశారు. ఏపీ సీఎం 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పందాకా నీళ్లు తీసుకుపోయారని, 400 టీఎంసీలను పట్టిసీమ పంపులతో ఎత్తిపోస్తున్నారని, పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రా ప్రాజెక్టులన్నింటినీ నీళ్లతో నింపుకొంటున్నారని గుర్తుచేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు 700 కిలోమీటర్ల దాకా నీళ్లు తీసుకెళ్తే..మన ముఖ్యమంత్రికి మాత్రం 70 కిలోమీటర్ల దూరంలోని మహబూబ్‌నగర్‌కు కూడా నీళ్లు తీసుకెళ్లడం చేతగావడం లేదని చురకలంటించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల నుంచి నీటి ఎత్తిపోతలతో ప్రస్తుత దుర్భిక్షంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుండేదని చెప్పారు. కానీ తెలంగాణలో క్రాప్‌హాలిడే అని కాంగ్రెస్‌ సర్కార్‌ భయపెడుతున్నదని విమర్శించారు. ‘దండంపెట్టి ప్రభుత్వానికి చెప్తున్నా.. రైతులు కష్టాల్లో ఉన్నరు.. రాష్ట్రం కష్టాల్లో ఉన్నది.. రాజకీయాలు పకనబెట్టి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోండి’ అని విజ్ఞప్తిచేశారు.

నర్సంపేటను దత్తత తీసుకుంటా..

నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి కష్టానష్టాల్లో పాలుపంచుకున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని కాపాడుకుంటామని కేటీఆర్‌ స్పష్టంచేశారు. కార్యకర్తలు, నాయకులు పెద్ది పోరాటస్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. కలిసికట్టుగా పనిచేసి నర్సంపేట గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చేయాలనుకున్న ప్రతి పనినీ దగ్గరుండి చేయిస్తానని హామీ ఇచ్చారు.

వరంగల్‌ జిల్లాలోని మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడుతామని స్పష్టంచేశారు. అక్కడి కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. తప్పుదోవపట్టించే నాయకుల బాటలో నడిచి ఇబ్బందులు తెచ్చుకోవద్దని కోరారు. తెలంగాణలో ఎక్కడికెళ్లినా మళ్లీ కేసీఆర్‌ రావాలనే కోరుకుంటున్నారని, మొన్న వినాయక చవితి, ప్రస్తుత బతుకమ్మ వేడుకల్లో ఈ ఆకాంక్షను ప్రజలు పాటల రూపంలో వ్యక్తంచేస్తున్నారని గుర్తుచేశారు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికలపై నాయకులు దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్‌ఎస్‌కు విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై కక్షతో సహకార సంఘాలను సర్కార్‌ నిర్వీర్యం చేస్తున్నదని, బీఆర్‌ఎస్‌కు చెందిన చైర్మన్లను తొలగిస్తున్నదని మండిపడ్డారు. సర్కార్‌కు చేతనైతే సహకార ఎన్నికలు పెడితే సత్తా చూపుతామని స్పష్టంచేశారు.

‘సర్‌’ ప్రక్రియ తర్వాత సభ్యత్వ నమోదు

రాష్ట్రంలో ‘సర్‌’ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతామని కేటీఆర్‌ ప్రకటించారు. పూర్తిస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతామని చెప్పారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై స్పష్టత వచ్చిన తర్వాత అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. మరో ఏడాదిలో కష్టకాలం పోయి మంచి కాలం వస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా ముందుకెళ్లి అసమర్థ రేవంత్‌రెడ్డి సర్కార్‌పై సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు.

రూ.60 వేల కోట్ల బాకీ పెట్టి బదనాం చేస్తున్నడు

సింగరేణికి రూ.60 వేల కోట్ల బాకీలు పెండింగ్‌ పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి బొగ్గు ఇవ్వడం లేదని బదనాం చేస్తున్నాడని కేటీఆర్‌ దుయ్యబట్టారు. కరెంట్‌ సరఫరా వ్యవస్థను పండబెట్టి..ఇప్పుడు కొందామంటే కరెంట్‌ లేదని బుకాయిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ సర్కార్‌తో ఒప్పందం చేసుకున్న కేసీఆర్‌పై స్కామ్‌ చేశారని అభాండాలు వేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. నాడు యూనిట్‌కు రూ.3.90 చొప్పున కొనుగోలు చేయడం కుంభకోణమైతే..ఇప్పుడు రూ.15 చొప్పున కొనాలని చూస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌ను ఏమనాలి? అని ప్రశ్నించారు.

కరెంట్‌ కొనుగోళ్లలో కుంభకోణం అంటూ నాటి కేసీఆర్‌ సర్కార్‌పై నెపంనెట్టి.. కమిషన్‌ వేసి బదనాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ‘రాష్ట్రంలో 30 లక్షల కరెంట్‌ పంపుసెట్ల కోసం.. సాగునీటి ప్రాజెక్టుల కోసం.. విద్యుత్తుపై ఆధారపడ్డ కుటీర పరిశ్రమలు, పరిశ్రమలకు కరెంట్‌ ఇచ్చేందుకే కేసీఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు. నాడు అరిగోస పడి అష్టకష్టాలు ఎదుర్కొని కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ ఇచ్చారని గుర్తుచేశారు.

సర్కార్‌ నిర్లక్ష్యం.. తెలంగాణకు శాపం

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కరెంట్‌ కోతలు మళ్లీ మొదలయ్యాయని కేటీఆర్‌ విమర్శించారు. కృష్ణా, గోదావరికి వరదలు వచ్చినప్పుడు నీళ్లెత్తకుండా వెయ్యి టీఎంసీలను సముద్రంలోకి వదిలిపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు నెలలుగా సాగునీరు, కరువు పరిస్థితులపై స్పందించకుండా కాలం పోయాక కరువు పేరిట నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరు నెలల క్రితమే కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రాజెక్టు వరకు వెళ్లి నీళ్లను చూపెట్టినా కాంగ్రెస్‌ సర్కార్‌ మేల్కొనలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగిస్తే ఇన్నేండ్లు తాను చేసిన దొంగమాటలు, నాటకం ప్రజల ముందు తేలి పోతుందనే రేవంత్‌రెడ్డి నీళ్లెత్తలేదని దెప్పిపొడిచారు. నాడు వృథాగా కిందికి పోయిన నీటిని ఎత్తిపోయకుండా ఇప్పుడు ఎల్‌ నినో పేరిట చేతులెత్తేశారని దుమ్మెత్తిపోశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీళ్లెత్తుమంటే ఎత్తకుండా రేవంత్‌రెడ్డి మొండికేశాడని విమర్శించారు. తెలంగాణ నుంచి నీళ్లు కిందికిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, తాగుసాగునీటికి అరిగోసపడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సర్కార్‌ చేతగానితనం తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని మండిపడ్డారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com