☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం.. కదంబం.. ఇలా చేస్తే అచ్చం గుళ్ళో ప్రసాదంలా ఎంత కమ్మగా ఉంటుందో

ఈ కదంబం నవరాత్రుల ప్రసాదంగానే కాకుండా, సాధారణ రోజుల్లోనూ ఒక సంపూర్ణ భోజనంగానూ బాగుంటుంది. దీనిని వేడివేడిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించండి. ఈ తొమ్మిది రోజుల పండుగలో అమ్మవారికి సమర్పించే వివిధ నైవేద్యాలలో కదంబం ప్రసాదం ఒకటి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం.. కదంబం.. ఇలా చేస్తే అచ్చం గుళ్ళో ప్రసాదంలా ఎంత కమ్మగా ఉంటుందో
Prasadam

ముందుగా 3/4 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి 3 కప్పుల నీళ్లు పోసి కనీసం ఒక గంట నానబెట్టాలి. నానిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక పెద్ద గిన్నెలో సొరకాయ, గుమ్మడికాయ, చిలకడదుంప, క్యారెట్, బెండకాయ, వంకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి.

Prasadam 1

ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టీస్పూన్ సాల్ట్, 2 కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి, మూత పెట్టి కూరగాయలు మెత్తబడేంత వరకు ఉడికించాలి. మీకు అందుబాటులో ఉన్న ఏ కూరగాయలనైనా వాడుకోవచ్చు. పొడి కోసం ఒక పాన్ పెట్టి పచ్చిశనగపప్పు, మినపగుళ్లు వేయించుకోవాలి. అవి సగం వేగిన తర్వాత మెంతులు, మిరియాలు వేసి వేయించాలి.

Prasadam 2

Pచివరగా ధనియాలు, బ్యాడిగి ఎండుమిర్చి వేసి వేయించి, ఆపై జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని రెండు మూడు సార్లు వాడుకోవచ్చు.ఉడికించిన కూరగాయలలో చింతపండు గుజ్జు, 1 టీస్పూన్ కారం, 2 టేబుల్‌స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలపాలి.

Prasadam 3

కొద్దిసేపు ఉడికించిన తర్వాత, ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఉండలు లేకుండా రెండు కప్పుల నీళ్లు కలిపి పల్చగా చేసుకోవాలి.పల్చగా చేసుకున్న అన్నాన్ని ఉడికించిన కూరగాయల మిశ్రమంలో వేసి, సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.

Prasadam 4

కదంబం కాస్త పల్చగా ఉండేలా చూసుకోవాలి, అప్పుడే చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది. దీనిని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పోపును ఉడికిన కదంబంలో వేసి బాగా కలిపితే కమ్మనైన, ఆలయాల రుచి గల కదంబం రెడీ .

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ranabaali Review: రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి హిట్ కొట్టారా..?కీబోర్డుపై అక్షరాలు ABCD క్రమంలో ఎందుకు ఉండవు? ఆశ్చర్యకరమైన కారణం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com