Ramayana Trailer Launch: దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. ఈ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ ట్రైలర్ విడుదల కార్యక్రమం నిన్న బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సీతాదేవి పాత్రధారి సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన పాత్రకు తగ్గట్టుగా, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ ఆమె ధరించిన గులాబీ రంగు పట్టుచీర వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకట్టుకుంది.
Read Also: Jailer 2 Day 1 Collection: బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ జైలర్ 2 తొలి రోజు ఎన్ని కోట్లంటే?

Ramayana Trailer Launch: దిగ్గజాల సమక్షంలో రామాయణ ట్రైలర్ విడుదల
‘దంగల్’ ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా తొలి భాగాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు చిత్రబృందం మొత్తం హాజరైంది. శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణ్బీర్ కపూర్, రావణుడిగా కనిపిస్తున్న రాకింగ్ స్టార్ యశ్, ఇతర కీలక నటులు రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, సంగీత సమ్రాట్ ఏఆర్ రెహమాన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
సంప్రదాయ దుస్తుల్లో కట్టుబెట్టేలా సాయి పల్లవి లుక్
ఈ సందర్భంగా సాయి పల్లవి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గులాబీ రంగు సిల్క్ శారీలో రాయల్ లుక్తో కనిపించారు. చీరపై వెండి జర్దోసీ వర్క్, వెండి బ్రోకేడ్తో రూపొందించిన వృత్తాకార మోటిఫ్లు, బోర్డర్ వెంబడి కట్వర్క్ డిజైన్ అత్యంత అద్భుతంగా ఉన్నాయి. దానికి సరిపోయేలా ఎల్బో-లెంగ్త్ (మోచేతుల వరకు) బ్లౌజ్ను ధరించారు. నగల విషయానికొస్తే.. చాలా హుందాగా, తక్కువ ఎంచుకుని స్టడెడ్ చెవిపోగులు, ఉంగరాలు, చేతికి కొన్ని గాజులతో మెరిసిపోయారు. సహజసిద్ధమైన రూపంతో, సింపుల్ మేకప్తో ఆమె మరింత ఎలిగెంట్గా కనిపించారు.
వేదికపై సాయి పల్లవి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి అభిమానులను అలరించారు. “రామాయణంలో సీత లాంటి అత్యంత పవిత్రమైన పాత్రను పోషించడం నాకు లభించిన ఒక గొప్ప వరం మరియు బాధ్యత” అని ఆమె పేర్కొన్నారు. నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల సమ్మేళనంతో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:






