☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం

ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం

ఆర్మూర్ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో మురుగు నీరు రోడ్లపైకి వచ్చి దుర్గంధంతో నిండిపోతోంది. దోమల బెడద పెరిగి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ముందుకు వస్తున్నప్పటికీ, ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు.

మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నా ఆర్‌ అండ్‌ బీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం స్పందించడం కూడా లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా సామాన్య ప్రజలు నరకం అనుభవిస్తున్నారని వాపోతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని, 10వ వార్డులో తక్షణమే డ్రైనేజీ, రోడ్డు పనులు పూర్తి చేయాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామిRanabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com