☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, కాంగ్రెస్ నాయకులు

Ujjaini Mahankali Temple: సికింద్రాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం దర్శించుకున్నారు. వారితో పాటు తెలంగాణ...
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, కాంగ్రెస్ నాయకులు

Ujjaini Mahankali Temple: సికింద్రాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం దర్శించుకున్నారు. వారితో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, ఏఐసీసీ సభ్యుడు సచిన్‌ సావంత్‌, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

Read Also: Warangal Super Speciality Hospital: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభంపై మంత్రి కీలక ప్రకటన

Ujjaini Mahankali Temple
Ministers and Congress leaders visit Goddess Ujjaini Mahankali

Ujjaini Mahankali Temple: వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రులకు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయ గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

అమ్మవారి దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రులకు, నాయకులకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కేంద్ర పెన్షన్ పథకాల పేర్లు మార్పుCMRL లంచం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన పినరయి విజయన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com