☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Abhijit Dipke Arrest: సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత!

ఢిల్లీలో 'లెహ్రా దో తిరంగా' ర్యాలీకి ముందు సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కేను(Abhijit Dipke Arrest) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Abhijit Dipke Arrest: సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత!

Abhijit Dipke Arrest: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయన నివాసంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ‘లెహ్రా దో తిరంగా’ జాతీయ జెండా ర్యాలీకి బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందే పోలీసులు ఈ చర్య చేపట్టారు. తాను ఏ తప్పు చేశానని అరెస్ట్ చేస్తున్నారని దీప్కే ప్రశ్నించగా, రాజధానిలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Sabarimala: శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న కేరళ.. డ్రోన్స్ తో ప్రత్యేక నిఘా.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

వారం వ్యవధిలో రెండోసారి పోలీసుల చర్య:

వారం వ్యవధిలో అభిజిత్ దీప్కే(Abhijit Dipke Arrest)ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారంటూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు బయలుదేరినప్పుడు విమానంలోనే ఆయనను అరెస్ట్ చేశారు.

కనాట్ ప్లేస్‌లో నిషేధాజ్ఞలు.. మున్సిపల్ కౌన్సిల్ అనుమతి నిరాకరణ:

అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ కేంద్రంగా ఈ తిరంగా ర్యాలీ నిర్వహించాలని సీజేపీ ప్రణాళిక రచించింది. అయితే, ఆ ప్రాంతంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ఈ మార్చ్‌కు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొంటూ పోలీసులు ముందే నోటీసులు అందజేశారు. ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించడం చట్టవిరుద్ధమని హెచ్చరించిన పోలీసులు, ముందస్తుగా దీప్కేను స్టేషన్‌కు తరలించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jailer 2 : టాలీవుడ్‌కి అన్యాయం చేసిన జైలర్ 2 డైరెక్టర్..? నిరాశలో తెలుగు ప్రేక్షకులు..దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com