☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఓటు చోరీపై రాహుల్‍ గాంధీ మాటే నిజమైంది : ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‍, న్యూడెమోక్రసీ నేతలు

ఓటు చోరీపై రాహుల్‍ గాంధీ మాటే నిజమైంది : ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‍, న్యూడెమోక్రసీ నేతలు
ఓటు చోరీపై రాహుల్‍ గాంధీ మాటే నిజమైంది : ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‍, న్యూడెమోక్రసీ నేతలు
ఓటు చోరీపై రాహుల్‍ గాంధీ మాటే నిజమైంది : ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‍, న్యూడెమోక్రసీ నేతలు
  • ‘సర్‍’ అక్రమాలపై గ్రేటర్ వరంగల్​లో ఆల్‍పార్టీ మీటింగ్‍
  • పాల్గొన్న ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‍, న్యూడెమోక్రసీ నేతలు

వరంగల్‍, వెలుగు: దేశంలో ఓటు చోరీ పేరుతో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రనేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ మొదటి నుంచి చెబుతున్న విషయాలే నిజమవుతున్నాయని వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగరాజు అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన ఆల్​పార్టీ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్ఞానేశ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే బర్తరఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈడీ, సీబీఐలను ఉపయోగించి నాయకులు, ప్రభుత్వాలను ప్రభావితం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటు చోరీ అంశంపై బీజేపీకి అండగా ఉంటోందని ఆరోపించారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 5న హనుమకొండ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఓటు చోరీ అంశంపై బీజేపీలోనే రెండు గ్రూపులు అయ్యాయని, అందులో ఒక గ్రూపు ఇండియా కూటమిలో చేరుతుందన్నారు. సీపీఐ, సీపీఎం నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ప్రభాకర్​రెడ్డి మాట్లాడుతూ ఓట్ల అక్రమ తొలగింపుపై దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని, ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో నిర్వహించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో న్యూడెమోక్రసీ, టీజేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీఐ, ఇతర ప్రజా, కుల, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← హైదరాబాద్‌లో పిల్లుల పండుగ.. పంజా విసిరితే చాంపియన్!పాల్వంచ: అప్పు ఎగ్గొట్టేందుకు స్నేహితుడి హత్యకు కుట్ర →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com