
Gold-Silver Prices Today : దసరా, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి శుభవార్త. గోల్డ్ రేటు వేగంగా తగ్గుతోంది. రోజురోజుకు గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం నుంచి ధరలు పడిపోతున్నాయి.

ఈనెల 12 నుంచి నేటి (శుక్రవారం) వరకు 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.4వేలు తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,176 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,47,440 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,35,150 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,47,590 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,35,300 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,47,440కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,150 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,30,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.