Upasana Konidela: ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో కీలక నియామకం జరిగింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్‌గా, మెగాస్టార్ చిరంజీవి కోడలిగా, నటుడు రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల, తాజాగా అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా అపోలో గ్రూప్ చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమాలకు ఆమె ఇకపై నాయకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం సుమారు రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడితో తమ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలో ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ప్రస్తుత ఆసుపత్రుల ఆధునికీకరణ వంటి ప్రాజెక్టులను ఉపాసన పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా రోగులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించేలా హాస్పిటల్ డిజైన్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
Read Also : Rims Hospital Incident : పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Upasana Konidela: తాతయ్య ఆశయ సాధనే లక్ష్యం.. ఉపాసన స్పందన
ఈ నియామకంపై ఉపాసన స్పందిస్తూ.. తన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రపంచ స్థాయి వైద్యాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆయన కల అని, తాము నిర్మించే ప్రతి ఆసుపత్రిలో, అభివృద్ధి చేసే ప్రతి సౌకర్యంలో ఆ నమ్మకాన్ని ప్రతిబింబించేలా చూడటమే తన బాధ్యత అని పేర్కొన్నారు. మంచి హాస్పిటల్ డిజైన్ రోగులకు సులువుగా దారి చూపడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ వైద్య బృందాలు సమర్థవంతంగా చికిత్స అందించడానికి వీలు కల్పించాలని అభిప్రాయపడ్డారు.
ఇతర వ్యాపార, సీఎస్ఆర్ కార్యకలాపాల్లోనూ కొనసాగింపు
ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టినా, ఉపాసన తన ఇతర కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తారు. డిజిటల్ వెల్‌నెస్, కార్పొరేట్ హెల్త్‌కేర్ వేదిక అయిన ‘యూఆర్‌లైఫ్’ (URLife) వ్యవస్థాపకురాలిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అపోలో గ్రూప్ సీఎస్ఆర్ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆమె నియామకం అపోలో విస్తరణ ప్రణాళికలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!






